వర్కింగ్ జర్నలిస్టుల హక్కుల సాధన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

శాయంపేట మండల కేంద్రంలో వర్కింగ్ జర్నలిస్టుల హక్కుల సాధన కమిటీ కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. గౌరవ అధ్యక్షులుగా చల్ల రాజి రెడ్డి, గౌరవ సలహాదారులుగా కాలేశ్వరం నరసయ్య, అధ్యక్షులుగా కోడిమల రాజేందర్, ప్రధాన కార్యదర్శిగా చెన్నబోయిన బుచ్చిబాబు, ఉపాధ్యక్షులుగా మహమ్మద్ అబ్దుల్లా, బాసాని బాలకృష్ణ, కార్యదర్శిగా తుడుం రాజు, సంయుక్త కార్యదర్శులుగా మోటంరవి, ఉప్పునర్సయ్య, ప్రచార కార్యదర్శిగా బంక ప్రవీణ్, కోశాధికారిగా జక్కుల కృష్ణ, కార్యవర్గ సభ్యులుగా బలిజ వేణు, జక్కుల శ్రీనివాస్, జక్కుల సురేష్ ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులు చల్లారాజిరెడ్డి, అధ్యక్షులు కొడిమాల రాజేందర్ మాట్లాడుతూ, వర్కింగ్ జర్నలిస్టుల హక్కుల సాధన కమిటీ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు వెల్లడించారు. నూతనంగా ఎన్నికైన కమిటీ నీ శాయంపేట సర్పంచ్ ఉమా-రవిపాల్, మైలారం సర్పంచ్ నూనె దివ్య- తిరుపతి, పత్తిపాక ఉప సర్పంచ్ తుడుం రాజు సత్కరించారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post