భూపాలపల్లి 10వ వార్డు: టీఆర్పీ అభ్యర్థి అవధూత కవితకు ఘన ప్రచార ర్యాలీ

 జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) అభ్యర్థి అవధూత కవిత కృష్ణకు మద్దతుగా ఘనంగా ప్రచార ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టీఆర్పీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్, రాష్ట్ర నాయకులు ఎస్.పి.కే. సాగర్, మహిళా అధ్యక్షురాలు సామల శ్రీలత, జిల్లా నాయకులు మడే సంతోష్, మామిడి శ్రీకాంత్, సాయి తదితరులు పాల్గొని, వార్డు ప్రజలతో కలిసి గడపగడపకు ప్రచారం చేశారు. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు సభ్యులు, ప్రజలు స్వచ్ఛందంగా చేరారు.సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ, “మార్పు కావాలంటే టీఆర్పీకి అవకాశం ఇవ్వాలి. గత పాలకుల నిర్లక్ష్యంతో మున్సిపాలిటీ అభివృద్ధి వెనుకబడింది. టీఆర్పీ అభ్యర్థి గెలిస్తే కౌన్సిల్‌లో ప్రజా సమస్యలపై పోరాడతారు. నిజాయితీగా ప్రజల పక్షాన నిలబడి వార్డు అభివృద్ధిని సాధిస్తారు” అని పేర్కొన్నారు.టీఆర్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న బహుజన హక్కుల కోసం అనేక పోరాటాలు చేస్తూ, పార్టీని ప్రజా సమస్యల ఏజెండాగా ముందుకు తీసుకెళ్తున్నారని, గత ప్రభుత్వాల మోసాలను ఎండగడుతూ తక్కువ కాలంలోనే ప్రజల్లో బలపడిందని, 2028లో అధికారంలోకి రాబోతుందని రవి పటేల్ ధీమా వ్యక్తం చేశారు.ఈ ఎన్నికల్లో 10వ వార్డులో బీసీ బిడ్డ అవధూత కవితకు అవకాశం ఇవ్వాలని ప్రజలకు కోరారు. ప్రజలు స్వచ్ఛందంగా ర్యాలీలో చేరి, గడపగడపకు ప్రచారం చేస్తూ మద్దతు తెలిపారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post