బీఆర్‌ఎస్ పతనం ప్రారంభమైంది: బీజేపీ అభ్యర్థిని కొనుగోలు చేయడం సిగ్గుచేటు

పరకాల: బీఆర్‌ఎస్ పార్టీ పతనం మొదలైందని పరకాల బీజేపీ ఎమ్మెల్యే డా. కాళీ ప్రసాద్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రజాస్వామ్యాన్ని కుంటున్న తీరుపై ఆయన ధ్వజమెత్తారు. బుధవారం పరకాల పట్టణంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డా. కాళీ ప్రసాద్ మాట్లాడారు. ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి, మున్సిపల్ ఎన్నికల కన్వీనర్ డా. సంతోష్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.మున్సిపల్ ఎన్నికల కన్వీనర్ డా. సంతోష్ కుమార్ మాట్లాడుతూ, అధికారంలో ఉన్నప్పుడు సంపాదించిన డబ్బులతో ఇతర పార్టీల అభ్యర్థులను కొనుగోలు చేయడం చల్లా ధర్మారెడ్డి ఆర్థిక అహంకారానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. గతంలో ఇలాంటి దుష్ప్రవృత్తులకు ప్రజలు బీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పారని, మళ్లీ అదే పద్ధతి అనుసరించడం సిగ్గుచేటని చెప్పారు. బీజేపీ అభ్యర్థులు డబ్బుల కోసం రారు, అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వస్తారని స్పష్టం చేశారు.జిల్లా అధ్యక్షుడు . సంతోష్ రెడ్డి మాట్లాడుతూ, బీజేపీ అభ్యర్థిని బెదిరించి కొనుగోలు చేయడానికి ప్రయత్నించడం ప్రజాస్వామ్యంపై దాడి అని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.డా. కాళీ ప్రసాద్ రావు మాట్లాడుతూ, బీజేపీ అభ్యర్థిని బెదిరించి కొనుగోలు చేసిన బీఆర్‌ఎస్‌కు పతనం తప్పదని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ దిగజారుడు రాజకీయాలను ప్రజలు మర్చిపోలేదని, గతంలో బీఫారమ్‌లతో గెలిచిన ఎమ్మెల్యేలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మాజీ ఎమ్మెల్యేకు గుర్తు లేవా అని ప్రశ్నించారు. బీజేపీలో నిష్కార్పణ కార్యకర్తలే ఉన్నారని, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. 14వ వార్డులో జరిగిన ఘటన ఓటర్లను అవమానించే నీచ రాజకీయాలకు నిదర్శనమని తీవ్రంగా విమర్శించారు. ప్రజాస్వామ్యం గెలవాలంటే బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాచం గురు ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి దేవనూరి మేఘనాథ్, పరకాల పట్టణ ప్రధాన కార్యదర్శి సంఘ పురుషోత్తం, నడికుడ మండల అధ్యక్షుడు ఎరుకల దివాకర్, బాసాని సోమరాజు, చంద్రమౌళి, సల్పల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post