పరకాల మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ, విశ్రాంత IPS అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మున్సిపాలిటీ ఎన్నికల కో ఆర్డినేటర్, మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి ప్రజలకు కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోవద్దని, బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.అంబేడ్కర్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో మాట్లాడిన వారు, గత ఎన్నికల్లో సాధ్యంకాని హామీలు చెప్పి గెలిచిన కాంగ్రెస్ ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను "ఆరు గ్యారెంటీలు ఎక్కడ?" అని నిలదీయాలన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందో పోల్చి చూడాలని సూచించారు.పరకాల పట్టణ అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే ఒక్క పైసా పనిచేయలేదని, బీఆర్ఎస్ చేసిన పనులకు రంగులేసి తమవి అని కాంగ్రెస్ గప్పులు పొడుతోందని ఆరోపించారు. ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దింపేందుకు వేచి చూస్తున్నారని చెప్పారు. ప్రజల ఆశీస్సులతో పరకాల గడ్డపై గులాబీ జెండా ఎగరనుందని ధీమా వ్యక్తం చేశారు.కార్యక్రమంలో 4,5,16,17,18,19 వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు పాల్గొన్నారు
పరకాలలో బీఆర్ఎస్ ప్రచారం: కాంగ్రెస్ మాయమాటలు నమ్మకండి.. గెలుపు ఖాయం
byBLN TELUGU NEWS
-
0
Post a Comment