పరకాల మున్సిపల్ పరిధిలోని తొమ్మిదవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన బాసాని దయాకర్ గెలుపు కోరుతూ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు విస్తృతంగా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశానుసారం స్థానికుడు, అందరికీ సుపరిచితుడైన దయాకర్ ను గెలిపించాలని కోరుతూ ఇంటింటి బొట్టు కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికార కాంగ్రెస్ పార్టీతోనే పరకాల అభివృద్ధి సాధ్యమని, వార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తాడని వివరిస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా మహిళా నాయకురాలు మాట్లాడుతూ బాసాని దయాకర్ కు వార్డులోని అన్ని వర్గాల ప్రజల మద్దతు లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగెం మాజీ ఎంపీపీ కందకట్ల కళావతి, 9వ వార్డు కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు దార్న వసుంధర, బాసాని కల్పన తదితరులు పాల్గొన్నారు.
బాసాని దయాకర్ గెలుపుకు మహిళా కార్యకర్తల ప్రచారం
byBLN TELUGU NEWS
-
0
Post a Comment