కార్పొరేట్‌లకు ఊడిగం.. పేదలు, మధ్యతరగతి వర్గాలు, తెలంగాణకు మొండికేంద్ర బడ్జెట్‌లో పేదలు, మధ్యతరగతి వర్గాలకు, తెలంగాణకు ఒరిగింది ఏమీ లేదు

శాయంపేట : కార్పొరేట్ వర్గాలకు కేంద్ర మోడీ ప్రభుత్వం ఊడిగం చేస్తోందని, దీనికి ఉదాహరణే ఇటీవల ప్రవేశపెట్టిన కార్పొరేట్ అనుకూల బడ్జెట్ అని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి విమర్శించారు.శుక్రవారం శాయంపేట మండల కేంద్రంలో సిపిఐ మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన, బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్ శక్తులకు దాసోహం అయ్యారని ఆరోపించారు. కార్పొరేట్ కంపెనీలకు రెడ్‌కార్పెట్ પરుస్తూ లక్షల కోట్ల రూపాయల రాయితీలు ఇచ్చి ప్రజల సంక్షేమాన్ని మరిచారని తెలిపారు.కేంద్ర బడ్జెట్‌లో పేదలు, మధ్యతరగతి వర్గాలకు ఒరిగింది ఏమీ లేదని, ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ మాటలకే పరిమితమైందని విమర్శించారు. ‘కార్పొరేట్ కే సాత్, కార్పొరేట్ కా వికాస్’ చందంగా కేటాయింపులు జరిగాయని చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అరకొర నిధులు కేటాయించి నిర్లక్ష్యం చేశారని, ధరల నియంత్రణపై ప్రస్తావన కూడా లేదని ఆయన తెలిపారు. ఆదాయపు పన్ను తగ్గింపు ఆశతో ఎదురుచూసిన మధ్యతరగతి ఉద్యోగులకు నిరాశే ఎదురయిందని అన్నారు.తెలంగాణ రాష్ట్రానికి కూడా బడ్జెట్‌లో మొండిచేయి చూపారని ఆరోపించుకొన్నారు. హైస్పీడ్ రైళ్లు తప్ప తెలంగాణకు శూన్యమే ఒరిగిందని, ప్రాజెక్టులు, పరిశ్రమలకు ప్రత్యేక నిధుల ప్రస్తావన లేదని విమర్శించారు. తెలంగాణ పునర్విభజన చట్టంలో పేర్కొన్న వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించకపోవడం బిజెపి మొండితనమని ఆరోపించారు.సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎన్.ఎ. స్టాలిన్, మండల కార్యదర్శి బత్తిని సదానందం, సహాయ కార్యదర్శి అనుకారి అశోక్, నాయకులు ఎండి. అంకుశావలీ, ముండ్రాతి రమేష్, గొట్టిముక్కల రాజు, బోగి రమేష్, ఉప్పుల సాంబయ్య, ఐరబోయిన నరేష్, బోగి రామదేవి, తీగల కల్పన, వైదులు రమా, ముస్కుల సరోజన తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post