సాంకేతికతతో ఆత్మహత్యా ప్రయత్నం చేసిన వ్యక్తిని కాపాడిన శాయంపేట పోలీసులు

శాయంపేట, ఫిబ్రవరి 7: మైలారం గ్రామానికి చెందిన వంటేరు ప్రశాంత్ మద్యం సేవించి 'ఆత్మహత్య చేసుకుంటాను' అంటూ శుక్రవారం (ఫిబ్రవరి 6) ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు స్థానిక శాయంపేట పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చగా, ఎస్ఐ జె. పరమేశ్వర్  వేగంగా స్పందించారు.సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ప్రశాంత్ లొకేషన్‌ను ట్రాక్ చేసిన పోలీసులు, అతను పెంబర్తి వద్ద ఉన్నాడని తెలుసుకుని అక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. వెంబడి పట్టుకుని అతన్ని సురక్షితంగా కాపాడారు. కౌన్సిలింగ్ చేసిన తర్వాత ప్రశాంత్‌ను కుటుంబ సభ్యులకు అప్పగించారు.సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాలు కాపాడిన శాయంపేట పోలీసులను మండల ప్రజలు, పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post