హెల్మెట్ ధరించండి – ప్రాణాలను కాపాడుకోండి: పరకాల ఏసీపీ సతీష్ బాబు

శాయంపేట, మంగళవారం:
వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని పరకాల ఏసీపీ సతీష్ బాబు పిలుపునిచ్చారు. మంగళవారం శాయంపేట మండలంలోని మాందారిపేట జాతీయ రహదారి పక్కన రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి వాహనదారుడు సరైన పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదని హెచ్చరించారు. చిన్నపిల్లలు వాహనాలు నడపడం నేరమని, అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. పిల్లలకు వాహనం ఇచ్చి ప్రమాదం జరిగితే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుని జైలు శిక్ష కూడా విధించబడుతుందని స్పష్టం చేశారు.
రోడ్డు దాటేటప్పుడు ఇరువైపులా జాగ్రత్తగా చూసి దాటాలని సూచించారు. “ప్రాణాలను కాపాడుకోండి” అనే కార్యక్రమాన్ని డీసీపీ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు. ప్రమాదాలకు గురై కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగిల్చవద్దని హితవు పలికారు. మీ భద్రతే పోలీసుల బాధ్యత అని గుర్తు చేశారు.
కార్యక్రమం అనంతరం వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సిఐ సంతోష్ కుమార్, శాయంపేట ఎస్సై జక్కుల పరమేష్, పోలీస్ సిబ్బంది, సర్పంచ్ కుక్కల సరోజన, చలివాగు ప్రాజెక్టు డైరెక్టర్ కుక్కల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post