నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో యువ పరివర్తన శిక్షణ కేంద్రం వివిధ వృత్తి ఆధారిత కోర్సులను అతి తక్కువ ఫీజుతో అందిస్తోంది. ఈ విషయాన్ని యువ పరివర్తన నర్సంపేట మేనేజర్ అడ్డ సతీష్ తెలిపారు.
ఈ కేంద్రంలో కంప్యూటర్ కోర్సులు, టాలీ, డేటా ఎంట్రీ, నర్సింగ్ అసిస్టెంట్, బ్యూటీషియన్, కుట్టుమిషన్ శిక్షణ వంటి కోర్సులు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. శిక్షణ పూర్తయ్యిన తర్వాత అభ్యర్థులకు జాబ్ ప్లేస్‌మెంట్ సౌకర్యం కూడా కల్పిస్తామని తెలిపారు.
ఆసక్తి గల విద్యార్థులు నర్సంపేట పట్టణంలోని ద్వారకపేటలో CPM పార్టీ కార్యాలయం పక్కన ఉన్న యువ పరివర్తన కార్యాలయంలో సంప్రదించాలని కంప్యూటర్ ట్రైనర్ ఆఫ్రీద్ సూచించారు.
ఈ కార్యక్రమంలో సేల్స్ ట్రైనర్ నవత, కుట్టుమిషన్ ట్రైనర్ ప్రియాంక, బ్యూటీషియన్ ట్రైనర్ అఖిల, మొబిలైజర్ అక్షయ్ కుమార్ పాల్గొన్నారు.
యువత నైపుణ్యాభివృద్ధి ద్వారా స్వయం ఉపాధి సాధించాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Post a Comment