హనుమకొండ జిల్లా శాయంపేట మండలానికి చెందిన తెలంగాణ ఉద్యమకారులు, రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన కృతజ్ఞత సభకు భారీగా తరలి వెళ్లారు. ఈ కార్యక్రమానికి శాయంపేట తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు ఇమ్మడిశెట్టి రవీందర్ నాయకత్వం వహించగా, హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు గద్దె మారి సురేష్, శాయంపేట టౌన్ అధ్యక్షుడు రంగు మహేందర్ ఆధ్వర్యంలో ఉద్యమకారులు కరీంనగర్‌కు బయలుదేరారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ఇమ్మడిశెట్టి రవీందర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని పేర్కొంటూ, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యమకారులను అధికారికంగా గుర్తించి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల యూత్ అధ్యక్షుడు ముంజల నాగరాజు, మండల నాయకులు ఉప్పు రాజు, దుంపల మహేందర్ రెడ్డి, మదర్ సాబ్, ఆడ ప్రభాకర్, కోల నందం తదితరులు పాల్గొన్నారు. శాయంపేట మండలం నుండి సుమారు 25 మంది ఉద్యమకారులు కరీంనగర్ సభలో పాల్గొని సంఘీభావం తెలిపారు.
తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధన కోసం తమ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు
Post a Comment