పెద్దకోడెపాకలో కురుమ కుల పెద్దమనిషిగా అమ్మరాజు ఏకగ్రీవ ఎన్నిక

BLN తెలుగు దినపత్రిక.పెద్దకోడెపాక, మార్చి 1: పెద్దకోడెపాక గ్రామంలో కురుమ కులస్తులు ఈరోజు బీరన్న గుడి వద్ద సమావేశం నిర్వహించి కురుమ కులానికి చెందిన పెద్దమనిషిగా అమ్మరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామంలో కుల ఐక్యతను బలోపేతం చేయడం, కుల సమస్యలను పరిష్కరించడం, కుల అభివృద్ధికి కృషి చేయడం ప్రధాన లక్ష్యాలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
అదేవిధంగా బీరన్న గుడి ఆలయ కమిటీ అధ్యక్షుడిగా ముజిగిరి వేణును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొత్తగా ఎన్నికైన కమిటీలు రెండేళ్లపాటు తమ బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు ప్రకటించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ మంద దీన ప్రభాకర్, ఉప సర్పంచ్ ఫైండ్ల సునిత చంద్రమౌళి హాజరై అభినందనలు తెలిపారు. కురుమ కులస్తులు ఐక్యంగా ఉండి సమిష్టిగా ముందుకు సాగాలని, కుల వైభవాన్ని మరింత పెంపొందించే దిశగా పెద్దలు కృషి చేయాలని వారు సూచించారు.
ఈ సమావేశంలో అమ్మ అశోక్, అన్న మహేందర్, బుట్టి రవీందర్, కొమ్ము శ్రీనివాస్, కొమ్ము సారంగపాణి, చిట్టి రమేష్, అమ్మ రంజిత్, నంద రాజ్ కుమార్, బుట్టి సురేష్ తదితర కుల పెద్దలు మరియు సభ్యులు పాల్గొన్నారు.
కురుమ కుల ఐక్యత కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post