భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి మంజూరైన కళ్యాణ లక్ష్మి – షాది ముబారక్ చెక్కులను పలు గ్రామాలకు చెందిన 23 మంది లబ్ధిదారులకు 23,02,668 విలువ గల రూపాయల చెక్కులను భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసా కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా కొంత ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ, రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకాలు కలుగకుండా ముందుకు తీసుకెళ్తున్నామని స్పష్టం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్పకాలంలోనే అనేక ప్రజా ప్రయోజనకర కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటోందని ఆయన అన్నారు. పేద కుటుంబాలకు అండగా నిలిచి సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఇంటికీ చేరువ కావడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమంలో కూడా పాల్గొని వార్డు సభ్యులకు తగు సూచనలు సలహాలు కూడా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలుస్తూ, పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది ఎమ్మెల్యే జీఎస్సార్...
byBLN TELUGU NEWS
-
0
Post a Comment