శాయంపేటలో డ్రంకెన్ డ్రైవ్ కేసులు: ముగ్గురికి జైలు శిక్ష – మరొక ముగ్గురికి జరిమానా

శాయంపేట మండలంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన ఆరుగురిపై పోలీసులు నమోదు చేసిన డ్రంకెన్ డ్రైవ్ కేసులను కోర్టు విచారించింది. ఈ కేసుల్లో ముగ్గురికి జైలు శిక్ష విధించగా, మరో ముగ్గురికి జరిమానాలు విధించారు.
కోర్టు ఆదేశాల మేరకు:
అద్దిచర్ల మహేందర్ S/o ఐలయ్య, R/o చౌలాపల్లి (ఆత్మకూరు) కు రూ.1500 జరిమానాతో పాటు 2 రోజుల సాధారణ జైలు శిక్ష విధించారు.
మాసంపల్లి కిషన్ రావు S/o రాజేశ్వర్రావు, R/o రేలకుంటకు రూ.2000 జరిమానాతో పాటు 3 రోజుల సాధారణ జైలు శిక్ష విధించారు.
ఎన్. రెడ్డి రాజిరెడ్డి S/o జోగిరెడ్డి, R/o చౌటుపర్తి కు రూ.2000 జరిమానాతో పాటు 3 రోజుల సాధారణ జైలు శిక్ష విధించారు.
మరో ముగ్గురు వ్యక్తులు:
పరికి రవి S/o రాజీరు, R/o గుండెప్పాడు
వావిల్లా కొమురయ్య S/o ఆగయ్య, R/o ముద్దునూరు
మార్క రమేష్ S/o కొమురయ్య, R/o ములుగు ఘనపూర్
వారికి మొత్తం రూ.3700 జరిమానా విధించారు. ఈ కేసుల్లో మొత్తం జరిమానా రూ.9700గా నమోదైంది.
ఈ కేసులను 2వ తరగతి ఇంచార్జ్ మేజిస్ట్రేట్ మరియు అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీమతి శ్రీవల్లి శైలజ గారు విచారించారు. మద్యం సేవించి వాహనం నడపడం ప్రాణాంతకమని, మరోసారి ఇటువంటి తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకొని జైలుకు పంపిస్తామని ఆమె హెచ్చరించారు.
పోలీసులు ప్రజలు రోడ్డు భద్రత నియమాలను పాటించాలని, మద్యం సేవించి వాహనం నడపవద్దని సూచించారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post