ఆర్ఎంపీపై కేసు నమోదుక్లీనిక్, మెడికల్ షాపులపై డ్రగ్ అధికారుల దాడులు

BLN తెలుగు దినపత్రిక..శాయంపేట మండలకేంద్రంలో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఆర్ఎంపీ క్లీనిక్, మెడికల్ షాపులను తనిఖీ చేశారు. హనుమకొండ డ్రగ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... ఇటీ వల కలెక్టర్ స్నేహ శబరీష్ శాయంపేట, దామెర, వేలేరు మండలాలలో స్పెషల్ డ్రైవ్స్ చేయాలని ఆదేశించడం, అలాగే డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాల మేర కు రైడ్స్ చేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో శాయంపేటలో ఎక్కువ చికి త్సలు చేస్తున్న ఆర్ఎంపీ క్లీనిక్లో రైడ్ చేశారు. క్లీనిక్లో డ్రగ్ లైసెన్స్ లేకుండా సుమారు 30 రకాల మందులను నిల్వ చేస్తూ అమ్ముతున్నట్లు గుర్తించారు. అందులో ఫిజిషియన్ శాంపుల్స్, ప్రభుత్వం సప్లై చేసే మందులు సైతం ఉన్నా యన్నారు. సుమారు రూ.35 వేల విలువ గల మందులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని తెలిపారు. అలాగే పలు మెడికల్ షాపులలో సైతం సోదాలు చేశామని వెల్లడించారు. ఈ రైడ్స్లో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అసి స్టెంట్ డైరక్టర్ జి.రాజ్యలక్ష్మి, హనుమకొండ డ్రగ్ ఇన్స్పెక్టర్ జే. కిరణ్ కుమార్, వరంగల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ పి.శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post