పరకాల మున్సిపాలిటీ ప్రచారసభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిభూపాలపల్లి జిల్లాలో చెల్పూరులోని 'ప్రజాపాలన ప్రగతి బాట' బహిరంగ సభ అనంతరం హనుమకొండ జిల్లాలోని పరకాల మున్సిపాలిటీలో 22 వార్డుల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఆదివారం జరిగిన ప్రచారసభకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార ప్రజా సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య ఆహ్వానితుడిగా హాజరయ్యారు.నిస్వార్థ నాయకుడు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పక్షంలో పోటీ చేస్తున్న 22 మంది అభ్యర్థులను గెలిపించడానికి ప్రజలు ఏకమై వచ్చారని, వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి గురించి మాట్లాడుతూ, ఆయనకు అపారమైన అనుభవం ఉందని, ఏ పని ఎవరితో ఎలా చేయించుకోవాలో తెలుసని పేర్కొన్నారు. ఆయన నిస్వార్థ సేవకుడు అని గుండెల మీద చేయి వేసుకొని చెప్పారు. మామునూరు ఎయిర్‌పోర్టు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. పరకాల పట్టణం నడిబొడ్డున ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను పట్టుబట్టి సాధించారని కొనియాడారు. ఇతరుల విషయాల్లో తలదూర్చరు, తన పని తాను చేసుకుంటారని చెప్పారు.నిధులు మంజూరు చేయిస్తాంఎన్నికల తర్వాత పరకాలకు గోదావరి జలాల తరలింపు కోసం రూ.38 కోట్లు మంజూరు చేయిస్తానని మంత్రి ప్రకటించారు. అదే విధంగా డ్రైన్ల అభివృద్ధికి రెండు విడతల్లో రూ.35 కోట్లు మంజూరు చేయిస్తానని వెల్లడించారు. ముస్లిం మైనారిటీల కోసం నెలాఖరులోపు షాదీఖానా నిర్మాణానికి GO ఇచ్చే బాధ్యత తనదేనని ప్రకటించారు.ఆడబిడ్డలు, రైతుల సంక్షేమంప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదింటి ఆడబిడ్డల కోసం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు. అంతేకాకుండా పెద్దోళ్లు తినే సన్నబియ్యం, ఉచిత బస్సు సౌకర్యాలను అందిస్తున్నామన్నారు. రైతుల సంక్షేమం కోసం 26 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామని పేర్కొన్నారు. 'రైతు భరోసా' ద్వారా ఎకరానికి రూ.12 వేల ఆర్థిక సాయం, సన్నవడ్లకు మద్దతు ధర, క్వింటాలుకు రూ.500 ఇచ్చిన ఘనత ప్రజా ప్రభుత్వానికే దక్కుతుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పేదలకు రేషన్ కార్డులు ఇవ్వకపోతే, ఈ ఇందిరమ్మ పార్టీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడమే కాకుండా పాత కార్డుల్లో కొత్త పేర్లను కూడా చేర్చామని తెలిపారు.పేదల ఆత్మగౌరవం నిలబెట్టాంఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల ఆత్మగౌరవాన్ని ప్రజా ప్రభుత్వం నిలబెట్టింది అని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వ పెద్దలు ఎర్రవెల్లిలో నిర్మించిన నాలుగైదు బొమ్మలు చూపించేవారని, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరిట మోసం చేశారని విమర్శించారు. పరకాల నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 ఇళ్లు మంజూరు చేశామని, పరకాల మున్సిపాలిటీకి 405 ఇళ్లు ఇచ్చామని చెప్పారు. ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే రెండో విడతలో అర్హులైన ప్రతి తోబుట్టువుకు సొంతింటి కల నెరవేరుస్తామని, తర్వాత మరో మూడు విడతల్లో అర్హులకు ఇళ్లు పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఏ కులం, ఏ మతం అని అడగం... పేదవారైతే చాలు ఇళ్లు ఇస్తామి. రూ.లంచం తీసుకోకుండా, పైరవీలు లేకుండా నేరుగా ఖాతాల్లోకి నగదు జమ చేస్తామని, నివాసయోగ్య ప్రభుత్వ స్థలాలను గుర్తించి పేదలకు పంపిణీ చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు: ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి, మార్కెట్ చైర్మన్, స్థానిక ముఖ్య నాయకులు. ప్రజలు
గోదావరి జలాల తరలింపు కోసం రూ.38 కోట్లుడ్రైన్ల అభివృద్ధికి రెండు విడతల్లో రూ.35 కోట్లుపరకాల మున్సిపాలిటీ ప్రచారసభలో
byBLN TELUGU NEWS
-
0
Post a Comment