పరకాలకు కావాల్సిన ప్రతీ పనికోసం నిస్వార్థంగా పని చేసే నాయకుడు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి22 మంది కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి

పరకాల పట్టణాన్ని అభివృద్ధి చేద్దాంకాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం... దొరల ప్రభుత్వం కాదుఆదివారం పరకాల పట్టణ కేంద్రంలోని కుంకుమేశ్వర ఆలయం సమీపంలో పరకాల మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ 22 వార్డు అభ్యర్థుల గెలుపు కోసం నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో రెవెన్యూ, గృహ నిర్మాణాలు, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య, పరకాల శాసనసభ్యుడు రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రసంగంమీ గుండెల్లో ఉన్న ఇందిరమ్మ పార్టీ, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని మంత్రి కోరారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాల్లో నిరంతరం ప్రజల శ్రేయస్సు, సంక్షేమం కోసం పనిచేస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం దొరల ప్రభుత్వం కాదు, ప్రజా ప్రభుత్వం అని స్పష్టం చేశారు.మామునూరు ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు ప్రధాన పాత్ర పోషించిన, అపార అనుభవం కలిగిన, పరకాలకు కావాల్సిన ప్రతీ పనికోసం నిస్వార్థంగా పని చేసే నాయకుడు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అని కొనియాడారు. ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా ఇళ్లు కట్టుకున్న అర్హులకు డబ్బులు నేరుగా అకౌంట్లలో జమ చేస్తున్నామని, త్వరలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని, పంట పొలాలకు పట్టాలు చేస్తామని ప్రకటించారు. పట్టుదలతో పరకాల ఎమ్మెల్యే ఇంటిగ్రేటెడ్ స్కూల్ షాంక్షన్ చేయించుకున్నారని పేర్కొన్నారు.కెసిఆర్ కోట్ల కమిషన్ కోసం కాళేశ్వరం కట్టాడు, పేదలకు ఇళ్లు కట్టలేదు. కేసీఆర్ హామీలు సొల్లు పురాణాలు. బీఆర్ఎస్ ఉద్యమకారులు చెప్పే సొల్లు పురాణాలు వింటే మీ మైండ్ బ్లాక్ అవుతుందని హెచ్చరించారు. వంద పడకల ఆసుపత్రి త్వరలో ప్రారంభం. పరకాల పట్టణంలో ముస్లిం సోదరులకు షాదీఖానా భవనం నిర్మాణానికి హామీ ఇచ్చారు. అర్హులకు నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత కరెంట్, సన్నబియ్యం, ఉచిత ప్రయాణం, రైతు రుణమాఫీ, వరి పంటకు బోనస్ తదితర సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. 22 కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి పట్టణానికి మరిన్ని నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేద్దాం అని పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికార రాష్ట్రాల్లో సన్నబియ్యం ఇవ్వడం లేదు అని విమర్శించారు.ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రసంగంకాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం అని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పిలుపునిచ్చారు. పరకాల పట్టణాన్ని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దదాం. ఒక ప్రత్యేకమైన DPR వ్యవస్థతో పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని, టీఆర్ఎస్-బీజేపీ నాయకుల మోసపూరిత మాటలను నమ్మవద్దని సూచించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి గెలిపించుకుంటే పట్టణానికి మరిన్ని నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.ఎంపీ కడియం కావ్య, మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతివరంగల్ పార్లమెంటు సభ్యురాలు కడియం కావ్య మాట్లాడుతూ, మీరు నమ్మి గెలిపించుకున్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ మీ నమ్మకాన్ని ఓమ్ము చేయరని చెప్పారు. పరకాలలో దళిత కాలనీలు మారాలంటే ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డీతోనే సాధ్యమని, 22 వార్డుల కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలి అని పిలుపునిచ్చారు.మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీ తరఫున కౌన్సిలర్‌గా నిలబడినవారు మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి బినామీలని విమర్శించారు. పరకాలకు పూర్వ వైభవం రావాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అని కోరారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post