జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద ఆదివారం నిర్వహించిన కార్నర్ మీటింగ్ అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగింది. జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిషిధర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ శ్రేణులు హాజరై మద్దతు తెలిపారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, రాష్ట్ర అధికార ప్రతినిధి డా. చందుపట్ల కీర్తి రెడ్డి పాల్గొని ప్రసంగించారు. బీజేపీ రాష్ట్ర, జిల్లా, మండల, పట్టణ స్థాయి నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు.ఎంపీ ఈటల రాజేందర్ ప్రసంగంమల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ, “జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రజల మద్దతుతో రాబోయే ఎన్నికల్లో కాషాయ జెండా తప్పకుండా ఎగరవేస్తాం.” కాంగ్రెస్, బీఆర్‌ఎస్ (టీఆర్ఎస్) పార్టీలు సంవత్సరాలుగా ప్రజలను మోసం చేశాయని, అభివృద్ధి పేరుతో మాటలు చెప్పాయి కానీ పల్లెల్లో వాస్తవ పరిస్థితి మారలేదని విమర్శించారు. సింగరేణి కార్మికుల సమస్యలను పట్టించుకోలేదని, కార్మికుల భద్రత, ఉద్యోగ భరోసా విషయాల్లో విఫలమయ్యాయని, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో పేదలకు ఆశలు చూపించి నిరాశ మిగిల్చాయి అని తీవ్రంగా విమర్శించారు. ఈ ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకున్నారని చెప్పారు.డా. చందుపట్ల కీర్తి రెడ్డి ప్రసంగంరాష్ట్ర అధికార ప్రతినిధి డా. చందుపట్ల కీర్తి రెడ్డి మాట్లాడుతూ, “ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశానికి నాయకత్వం వహిస్తున్నంతకాలం భారతదేశ భద్రతకు ఎలాంటి లోటు ఉండదు. మోడీ దేశాన్ని దేవుడిలా కాపాడుకుంటున్నారు.” ఉగ్రవాదం, అంతర్గత భద్రతలో కఠిన నిర్ణయాలు తీసుకుని దేశాన్ని సురక్షితంగా ఉంచుతున్నారని, ప్రపంచ దేశాల ముందు భారతదేశ గౌరవాన్ని పెంచారని పేర్కొన్నారు.కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పేదలు, రైతులు, యువత, మహిళల సంక్షేమ పథకాలు వల్ల అన్ని వర్గాల ప్రజల్లో బీజేపీపై నమ్మకం బలపడుతోందని, ప్రజల ఆదరణ రోజురోజుకీ పెరుగుతోంది అని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అవినీతి, అభివృద్ధి లోపాలను ప్రజలకు వివరించారు. నిజాయితీ గల పాలన, పారదర్శకత, సమగ్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం అని స్పష్టం చేశారు.ప్రజలకు మనవిచివరిగా భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రజలందరినీ రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలి
జయశంకర్ భూపాలపల్లిలో కాషాయ జెండా ఎగరవేస్తాం – మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్బీజేపీపై ప్రజల ఆదరణ రోజురోజుకీ పెరుగుతోంది – రాష్ట్ర అధికార ప్రతినిధి డా. చందుపట్ల కీర్తి రెడ్డి
byBLN TELUGU NEWS
-
0
Post a Comment