BLN తెలుగు దినపత్రిక .జనగామ, ఫిబ్రవరి 10: జనగామ మున్సిపల్ ఎన్నికల్లో 19వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి దోర్నాల అనిత వెంకటేశ్వర్లకు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం పూర్తి మద్దతు. సోమవారం సంఘం తరపున జిల్లా వివిద మండలాల అధ్యక్షులు ప్రచారంలో పాల్గొని, చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.సంఘం నాయకులు మాట్లాడుతూ, "అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్న అనిత వెంకటేశ్వర్లను గెలిపించాలి. ఈసారి పద్మశాలీల సత్తా చాటాలి" అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షుడు వేముల బాలరాజు, చిల్పూర్, రఘునాథపల్లి, పాలకుర్తి, జాఫర్గాడ్ మండల అధ్యక్షులు గజ్జల దామోదర్, మాచర్ల సారయ్య, కరిమికొండ వెంకటేశ్వర్లు, డాక్టర్ మామిడాల సోమనారాయణ, రాష్ట్ర నాయకులు రాపోలు రామ్మూర్తి, రాష్ట్ర మీడియా ఇన్‌చార్జ్ చింతకింది కృష్ణమూర్తి, కుమారస్వామి, దోర్నాల రమేష్, జనగామ మాజీ కౌన్సిలర్ మచ్చ బాల్ నరసయ్య, కారంపూడి వెంకట నరసయ్య, సంఘం బాధ్యులు పాల్గొన్నారు
మున్సిపల్ ఎన్నికల్లో 19వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థికి పద్మశాలి సంఘం మద్దతు
byBLN TELUGU NEWS
-
0
Post a Comment