మేడారంలో భక్తుల రద్దీ..

BLNతెలుగు దినపత్రిక, వరంగల్ ప్రతినిధి :బాసని బాలు
మేడారం భక్తులతో నిండిపోయింది. గద్దెల పరిసరాలు కిక్కిరిసిపోయాయి. అర్థరాత్రి నుండే భక్తుల రాక మొదలైంది. వేకువజామునే జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి వనదేవతల దర్శనానికి బారులు తీరారు. సమ్మక్క- సారలమ్మ గద్దెలను దర్శించుకొని మొక్కులు చెల్లిస్తున్నారు. నేడు 2 లక్షల మందికి పైగా భక్తులు మేడారానికి వస్తారని అధికారుల అంచనా. మరోవైపు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో పస్రా, తాడ్వాయి మార్గం కిక్కిరిసిపోయింది. ఈ క్రమంలో తాడ్వాయి నుంచి మేడారం వస్తున్న ప్రైవేటు వాహనాలు, ఆర్టీసీ బస్సులతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అక్కడికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post