వి బి జి రామ్ జి చట్టాన్ని రద్దు చేయాలి
యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాధగొని రవి
11- 1- 2026 రోజున నేరేడు పల్లి లో యం సి పి ఐ యు హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం జిల్లా సహాయ కార్యదర్శి నీల రవీందర్ అధ్యక్షతననిర్వహించడం జరిగింది ఈ సమావేశానిక రాష్ట్ర కార్యదర్శి గాధగొని రవి హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి గాధగొని రవి మాట్లాడుతూ....కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలతో రైతుల కార్మికుల పరిస్థితి ఆందోళన కరంగా మారిందని తక్షణమే నాలుగు లేబర్ కోడ్స్, నూతన విత్తన, విద్యుత్తు చట్టాలను, వి బి జి రామ్ జి పథకాన్ని ఉపసంహరించాలని వారు కేంద్ర ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. రైతాంగం ఆరుగాలం కష్టించి పంటలు పండిస్తున్న సరైన ధర లేక మార్కెట్ దోపిడీకి గురై దివాలా తీస్తూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అలాంటి రైతాంగాన్ని కాపాడటానికి పంటల మద్దతు ధర చట్టం చేయకుండా తాత్సారం చేస్తూ రైతులకు హాని కలిగించే విధంగా ఇతర కంపెనీలకు కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూరే విధంగా నూతన విత్తన చట్టాన్ని అలాగే కేంద్ర విద్యుత్ చట్టాన్ని తీసుకురావడం అన్యాయం అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు కనీసం వంద రోజులు ఉపాధి కల్పించే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని సైతం సరిగ్గా అమలు చేయకుండానే వికసిత్ భారత్ జి రామ్ జి పథకంగా మార్చి గత చట్టానికి తూట్లు పొడిచిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఇలాంటి విధానాలను మానుకోవాలని లేకపోతే ప్రజా పోరాటాలత కార్మిక వర్గానికి ఎంతో ఉపయోగకరంగా ఉండే 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ ను తీసుకురావడంతో కార్మిక హక్కులను హరించి పెట్టుబడుదారులకు అనుకూలంగా మార్చినట్లు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక హక్కులను కాపాడుతామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇలాంటి కార్మిక వ్యతిరేక విధానాలు తీసుకురావడం దారుణం అన్నారు ఇప్పటికైనా అలాంటి చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిరుపేద కుటుంబాలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి కట్టించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. అదే విధంగా గా పార్టీ నీ అన్ని గ్రామాలలో విస్తృత పరిచి అన్ని శాఖ సమావేశాలు నిర్వహించాలి. పార్టీ నీ బలోపేతం చేయాలి అని ఆయన పిలుపు నిచ్చారు
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఎన్ రెడ్డి హంసారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాస్ సావిత్రి, గడ్డం నాగార్జున, చీపురు ఓదయ్య, జిల్లా కమిటీ సభ్యులు కూతురు ఇంద్రారెడ్డి, దామరకొండా రమేష్, మంద భద్రయ్య, తక్కలపల్లి బాపు రావు, పార్టీ సభ్యులు, అన్నబోయిన ప్రేమలత, మట్టడ మొగిలి, రంజిత్, ఎన్ రెడ్డి రాజేంద్ర,సరోజన, తదితరులు పాల్గొన్నారు.
Post a Comment