స్వాతంత్ర్య పోరాటంలో వడ్డె ఓబన్న ప్రదర్శించిన ధైర్య సాహసాలు అనన్య సామాన్యమైనవని జిల్లా బిసి సంక్షేమ అధికారి ఇ ఇందిర తెలిపారు.
సోమవారం ఐడిఓసి కార్యాలయంలోని బిసి సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో వడ్డే ఓబన్న జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వడ్డే ఓబన్న
జయంతిని అధికారికంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డె ఓబన్న అని కొనియాడారు. ఓబన్న ఆనాడు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జరిపిన సాయుధ పోరులో సైన్యాధ్యక్షుడిగా వీరోచిత పోరాటం చేశారని గుర్తు చేశారు. వడ్డె ఓబన్న ఆశయాల సాధన కోసం కృషి చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సహాయ బిసి సంక్షేమ అధికారి క్రాంతి కిరణ్, వడ్డెర సగం జిల్లా అధ్యక్షులు దారంగి మంజుల, శివరాత్రి
రమేష్, మిర్యాల మల్లయ్య, వడ్డెర సగం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment