ఉత్సాహంగా పోలీస్ ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్

శాయంపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది ప్రెస్ మిత్రుల జట్ల మధ్య సోమవారం పత్తిపాక శివారు గ్రౌండ్ లో జరిగిన స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్లో పోలీస్ జట్టు విజయం సాధించింది ఏసిపి, సీఐ,ఎస్ఐ లు బ్యాటింగ్ తో అలరించారు. అనంతరం గెలుపొందిన జట్టుకు బహుమతి అంద జేశారు అనంతరం ఏసీబీ మాట్లాడుతూ నిత్యం పని ఒత్తిడిలో ఉండే పోలీసులు జర్నలిస్టుల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరగడం శుభ పరిణామమని మ్యాచ్ క్రీడా స్ఫూర్తితో ఉత్కంఠ భరితంగా సాగిందన్నారు. అనంతరం విజేత జట్టుకు మరియు రన్నర్ జట్టుకు బహుమతులు అందించి అభినందనలు తెలిపారు. పరకాల ఏసీపీ సతీష్ బాబు, శాయంపేట సీఐ,రంజిత్ రావు, ఆత్మకూరు పరకాల సిఐ క్రాంతి కుమార్, శాయంపేట ఎస్సై జక్కుల పరమేష్, పరకాల ఎస్ఐ రమేష్, పవన్, దామెర ఎస్సై కొంక అశోక్, ఆత్మకూరు ఎస్సైతిరుపతి, పోలీస్ సిబ్బంది, శాయంపేట మండల ప్రింట్ మీడియా మరియు రిపోర్టర్లు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post