ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలను పరకాల పట్టణంలోని తొమ్మిదవ వార్డు ఇంచార్జ్ దార్న వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ముఖ్యఅతిథిలుగాపరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్,తొమ్మిదవ వార్డు మునిసిపాల్ ఎన్నికల ఇంచార్జ్ సంగం మండల ఎక్స్ ఎంపీపీ కందకట్ల నరహరి హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరాగాంధీ వారసురాలుగా రాజకీయ ప్రవేశం చేసి అనతి కాలంలోనే అగ్ర నాయకురాలుగా ప్రియాంక గాంధీ ఎదిగారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తొమ్మిదవ వార్డ్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఎల్దండి సురేష్,బండారి కృష్ణ,వంగర సుమలత,రావుల సాంబయ్య,రావుల తిరుపతి, తంగేళ్ల నవీన్ రెడ్డి,మహేందర్,తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు.
byBLN TELUGU NEWS
-
0
Post a Comment