మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు కృషి చేయాలి.

పరకాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ పరకాల పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సోమవారం రోజున పరకాల పట్టణంలోని తొమ్మిదవ వార్డు లో శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశానుసారం వార్డు ఇన్చార్జ్ దార్న వేణుగోపాల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కొయ్యడ శ్రీనివాస్, 9వ వార్డు ఎన్నికల ఇంచార్జ్, సంఘం మండల మాజీ ఎంపీపీ కందకట్ల నరహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు, గృహ జ్యోతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఎల్దండి సురేష్, బండారి కృష్ణ, వంగర సుమలత, రావుల సాంబయ్య, తిరుపతి, తంగేళ్ల నవీన్ రెడ్డి, మహేందర్,కుమార్,సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post