ఎడ్లబండిపైనే వనదేవతల సన్నిధికి !" తరాలు మారినా మారని సాంప్రదాయం

మేడారం : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క-సారలమ్మ చెంతకు కొన్ని జిల్లాల నుంచి భక్తులు ఎడ్ల బండ్లపై పిల్లా జెల్లాతో కలిసి చేరుకున్నారు. ఆధునిక వాహనాలు ఎన్ని ఉన్నా వారు మాత్రం ఎడ్లబండినే నమ్ముకున్నారు. ఇది పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న భక్తి మార్గం. ముందుగా గుడియమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. పసుపు, కుంకుమ, కొబ్బరికాయలతో మొక్కులు చెల్లించారు. బండ్లకు రంగురంగుల పూలు కట్టారు. జెండాలను పాతారు. పిల్లాజెల్లా అంతా బండిపైనే చేరారు. అవసరమైన బియ్యం. పప్పులు, వంట సామాగ్రిని బండిలోనే సర్దుకున్నారు. డప్పు చప్పుళ్ల మధ్య ప్రయాణం సాగుతోంది. అడవి మార్గంలో "జై సమ్మక్క.. జై సారలమ్మ" అనే నినాదాలు మార్మోగుతున్నాయి. చిన్నారుల కేరింతలు ఈ ప్రయాణంలో ప్రత్యేక ఆకర్షణ. పెద్దలు తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. పచ్చని చెట్ల నీడన బండ్లు సాగిపోతున్నాయి. చీకటి పడితే చెట్ల కిందనే విడిది చేస్తారు. అక్కడే వంట చేసుకుంటారు. అందరూ కలిసి భోజనం చేస్తారు. ఈ ప్రయాణంలో విడదీయలేని ఆత్మీయత కనిపిస్తుంది. ఆధ్యాత్మిక అనుభూతి లభిస్తుంది. సంప్రదాయం మీద ఉన్న గౌరవం ప్రతి అడుగులోనూ ప్రతిబింబిస్తోంది.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post