శాయంపేటలో మడేలేశ్వర స్వామి జయంతి వేడుకలు

శాయంపేట:రజకుల ఆరాధ్య దైవం శ్రీ మడేలేశ్వర స్వామి జయంతి వేడుకలను రజక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం మడేలేశ్వర స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రజకవీధిలో మడేలేశ్వర స్వామి చిత్రపటాన్ని పూలతో అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి కుటుంబం టెంకాయ కొట్టి మడేలేశ్వర స్వామిని మొక్కుకున్నారు. అనంతరం మధ్యాహ్నం మహాన్నదన కార్యక్రమం నిర్వహించారు. తదనంతరం సాయంత్రం గ్రామములోని పుర వీధుల్లో మడేలేశ్వర స్వామి శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. రజక కులస్తులు జిల్లాలో మొదటిసారిగా శాయంపేటలో మడేలేశ్వర స్వామి జయంతి వేడుకలు నిర్వహించడం హర్షనీయమని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. ఈ ఉత్సవలలలో రజక సంఘం నాయకులు నడిగొట్టు సాంబయ్య, పైండ్ల రమేష్, నడిగొట్టు మొగిలి, నడిగొట్టు సాంబయ్య, కొత్తపల్లి రవీందర్, పున్నం సాంబయ్య, రాయరాకుల సుమన్, నడిగొట్టు రాజు, యూత్ సభ్యులు పున్నం అఖిల్, నడిగొట్టు అరవింద్, రంజిత్, అశ్విత్ సాయిచరణ్ రజక కులస్తులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post