కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి- చర్చి పాస్టర్లకు చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే జీఎస్సార్...

BLN తెలుగు దినపత్రిక, 20 జనవరి:*భూపాలపల్లి జయశంకర్ జిల్లా
కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు మంగళవారం భూపాలపల్లి మంజూరునగర్లోని ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని మొత్తం 47 చర్చిల పాస్టర్లకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రూ.14,10,000 విలువైన చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... నియోజకవర్గంలోని క్రిష్టియన్లకు 47 చర్చీలకు గాను నిర్వహణకు రూ.14,10,000 లక్షలు మంజూరయ్యాయన్నారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
*వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్...*
రూ.200 లక్షల వ్యయంతో భూపాలపల్లి 5 ఇంక్లైన్ కమాన్ నుండి భాస్కర్ గడ్డ వరకు బీటీ రోడ్డు వైడెనింగ్ పనులకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ లతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.150 లక్షల వ్యయంతో భాస్కర్ గడ్డ పోషమ్మ దేవాలయం నుండి వేశాలపల్లి డబుల్ బెడ్ రూం ఇళ్ల కాలనీ వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా, మరో రూ.200 లక్షలతో వేశాలపల్లి డబుల్ బెడ్ రూం ఇళ్ల కాలనీ ప్రహారీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post