శాయంపేట మండలంలో.తహరాపూర్‌లో ప్రజా బాట ప్రోగ్రామ్‌కు సూపర్‌డెంట్ ఇంజనీర్ మధుసూదన్ రావు స్పందన.. ప్రమాదకర లైన్లు సరిచేసి ప్రజలకు జాగ్రతలు తెలిపారుహనుమకొండ జిల్లా తహరాపూర్‌లో గురువారం ప్రజా బాట ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సూపర్‌డెంట్ ఇంజనీర్ మధుసూదన్ రావు పాల్గొని, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ లైన్లను స్వయంగా పరిశీలించి సరిచేశారు.ప్రమాదాలు జరగకుండా ఉండటానికి బావుల వద్ద లేదా ఇంటి విద్యుత్ కనెక్షన్లలో నాణ్యమైన పరికరాలు వాడాలని, అందరూ అప్రమత్తంగా ఉండి జాగ్రతలు పాటించాలని గ్రామ ప్రజలకు సూచించారు. "మీరంతా అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలను సహజంగానే నివారించవచ్చు" అని ప్రజా బాట సమావేశంలో చెప్పారు.ఈ కార్యక్రమంలో J. దేవేందర్ నాయక్ (అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్, పరకాల), M. చొక్కారావు (సబ్ ఇంజనీర్, శాయంపేట), A. రాజేందర్ (లైన్ ఇన్స్పెక్టర్), బి. సోముల (లైన్‌మెన్), U. సాగర్ (అసిస్టెంట్ లైన్‌మెన్), S. విష్ణు (అసిస్టెంట్ లైన్‌మెన్), రాజు (ఆన్ మ్యాన్) పాల్గొన్నారు. తహరాపూర్ సర్పంచ్, ఉపసర్పంచ్ తో పాటు గ్రామ ప్రజలు, తదితరులు హాజరై కార్యక్రమం విజయవంతం చేశారు.విద్యుత్ శాఖ ఈ రకమైన ప్రజా బాట కార్యక్రమాల ద్వారా ప్రమాదాల నివారణకు కృషి చేస్తోంది.
హనుమకొండ జిల్లా విద్యుత్ శాఖ పత్రిక ప్రకటన
byBLN TELUGU NEWS
-
0
Post a Comment