గట్టమ్మ తల్లిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఎంపీ డా. కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి.

BLN తెలుగు దినపత్రిక.తేది: 20.01.2026:
ములుగు జిల్లా కేంద్రం సమీపంలోని గట్టమ్మ తల్లి ఆలయాన్ని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య , మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి  సందర్శించారు. ఈ సందర్బంగా అమ్మ వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో, పూజారులు ఎంపి, ఎమ్మెల్యే  ఆలయ సంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. 
ఈ కార్యక్రమంలో చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, ఇతర ప్రజా ప్రతినిధులు, స్థానిక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post