మహిళల పట్ల ప్రజా ప్రభుత్వానికి

 మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండిరేగొండలో రూ.3 కోట్ల 75 లక్షలతో నూతన బస్టాండ్ నిర్మాణ పనులకు శంకుస్థాపనభూపాలపల్లి/రేగొండ, జనవరి 19: మహిళల పట్ల ప్రజా ప్రభుత్వానికి ప్రత్యేక గౌరవం ఉందని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.సోమవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని క్రిష్ణాకాలనీలో రూ.3 కోట్లతో ప్రొటెక్షన్ వాల్ పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బట్టు కరుణాకర్, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్‌లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే జీఎస్సార్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ, టీ-2 క్వార్టర్స్, క్రిష్ణాకాలనీలో అడవి జంతువుల బెడద ఉండటం వల్ల ప్రజా భద్రత కోసం ప్రొటెక్షన్ వాల్ నిర్మిస్తున్నామని తెలిపారు.ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని, గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ చీరలు, పట్టణాల్లో 18 ఏళ్లు నిండిన మహిళలకు సంక్రాంతి సారెలు అందజేశామని పేర్కొన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో వడ్డీ రుణాలు, ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్‌లను ఊరేసినా, ప్రజా ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు, అర్హులకు రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నామని వివరించారు. మున్సిపాలిటీలు, దేవాలయాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని, గత రెండేళ్ల ఆర్టీసీ బస్సుల కొనుగోలు లేకపోయినా మహిళా సంఘాలు 3,200 బస్సులు నడుపుతున్నాయని తెలిపారు.భూపాలపల్లి అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రూప్-1, గ్రూప్-2లో ఉద్యోగాలు పొందినవారిని గుర్తు చేస్తూ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వానికి ఆశీర్వాదం చేయాలని కోరారు.అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ, మౌలిక సదుపాయాల పరిష్కారానికి కోట్లాది రూపాయలు వెచ్చించి భూపాలపల్లి మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాలకు రూ.1 కోటి విలువైన బ్యాంకు రుణాలు, రూ.19 లక్షల వడ్డీ రహిత రుణాల చెక్కులు, పట్టణ మహిళలకు చీరలు పంపిణీ చేశారు.రేగొండలో నూతన బస్టాండ్ పనులకు శంకుస్థాపనరేగొండ మండల కేంద్రం జగ్గయ్యపేట రోడ్డులో రూ.3.75 కోట్లతో నూతన బస్టాండ్ నిర్మాణానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్, ఆర్టీసీ ఈడి లతో శంకుస్థాపన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 97 డిపోలు, 341 బస్ స్టేషన్లతో 10 వేల బస్సులు, 40 వేల మంది ఉద్యోగులతో ఆర్టీసీ రోజుకు 65 లక్షల మందిని 35 లక్షల కి.మీ. ప్రయాణం చేస్తుందని తెలిపారు. తెలంగాణలో ఆర్టీసీ గ్రామీణ ప్రజల లైఫ్‌లైన్‌గా ఉందని, సీఎం ఆదేశాల మేరకు ప్రతి గ్రామానికి బస్సులు చేరాలని సూచించారు.ఆర్థిక సంక్షోభంలో ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, 48 గంటల్లో మహిళలకు ఉచిత బస్సు, 3,500 ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు అందిస్తున్నామని పేర్కొన్నారు. బస్టాండ్‌ను సౌకర్యవంతంగా నిర్మించాలని, మేడారం వెళ్లేవారికి రేగొండ సెంట్రల్ పాయింట్‌గా గ్రౌండ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post