చికిత్స పొందుతూ యువకుడు మృతి

దామర మండలంలోని ఒగ్లా పూర్ స్టేజ్ వద్ద బైక్ అదుపు తప్పి పడిపోయిన ఘటనలో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్సై కొంక అశోక్ సోమవారం ఈ విషయాన్ని తెలిపారు.ఘటన వివరాలు
నల్లబెల్లి మండలం బొల్లోనిపల్లె గ్రామానికి చెందిన గాదె హరిప్రసాద్ (సో/రాజమల్లు లేట్) జనవరి 18న ద్విచక్రవాహనంపై హన్మకొండకు పనిమీద వెళ్తుండగా ఒగ్లా పూర్ స్టేజ్ వద్ద బైక్ అదుపు తప్పింది. కింద పడటంతో తలకు తీవ్ర గాయాలు పాలైన అతను NSR హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
మృతుడి తల్లి గాదె శ్రీలత ఫిర్యాదు మేరకు ఎస్సై కొంక అశోక్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుగుతోంది. ఈ రోడ్డు ప్రమాదం గ్రామంలో విషాదాన్ని కలిగించింది.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post