హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలో కులం పేరుతో దూషిస్తూ దాడి చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకువాలని బాధితుడు డిమాండ్ చేశారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. పత్తిపాక గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ దైనంపెల్లి కుమారస్వామి అదే గ్రామానికి చెందిన అన్నేబోయిన రాజమౌళి అనే వ్యక్తి ట్రాక్టర్ నడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం గిరబోయిన రాజయ్య భూమిలో దున్నుతుండగా అదే గ్రామానికి చెందిన పల్లెబోయిన రవి వ్యక్తి వచ్చి డ్డ్రైవర్ కుమారస్వామి ని కులం పేరుతో దూషిస్తూ దాడి చేశాడు. అంతటితో ఆగకుండా ట్రాక్టర్ తాళం చెవి, సెల్ ఫోన్ లాక్కున్నాడు. దీంతో బాధితుడు రవిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు కుమారస్వామి తెలిపాడు.
కులం పేరుతో దూషిస్తూ దాడి చేసిన వ్యక్తి పై చర్య తీసుకోవాలి
byBLN TELUGU NEWS
-
0
Post a Comment