మహారాష్ట్ర మున్సిపాలిటీల్లో బీజేపీ ఘనవిజయం పరకాలలో అంబరాన్ని అంటిన సంబరాలు

పరకాలలో అంబరాన్ని అంటిన సంబరాలు
మహారాష్ట్ర మున్సిపాలిటీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడంతో పరకాల పట్టణంలో శుక్రవారం అంగరంగ వైభవంగా సంబరాలు నిర్వహించారు. పరకాల పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో బస్టాండ్ కూడలిలో బాణాసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ పి జయంత్ లాల్ మాట్లాడుతూ మహారాష్ట్రలో అత్యధిక మున్సిపాలిటీలను బీజేపీ కైవసం చేసుకోవడం ఎంతో ఆనందకరమని తెలిపారు. అదే ఉత్సాహంతో రాబోయే పరకాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా బీజేపీ జెండా ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేసిన సంక్షేమ పథకాలే బీజేపీ విజయాలకు పునాదిగా నిలిచాయని పేర్కొన్నారు.మహారాష్ట్రలో బీజేపీకి ఘన విజయం అందించిన ప్రజలకు ఈ సందర్భంగా నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ ప్రధాన కార్యదర్శి సంఘ పురుషోత్తం పాలకుర్తి తిరుపతి బాసాని సోమరాజు, మారేడు గొండ భాస్కరాచారి, ధర్నా నారాయణదాసు, పావుశెట్టి శ్రీనివాస్, మార్త రాజభద్రయ్య, దంచనాల సత్యనారాయణ, ఆకుల రాంబాబు, మిడిదొడ్డి నరేష్, దంచనాల కిరణ్, కుంట మల్ల గణేష్, కానుగుల గోపీనాథ్, మెంతుల సురేష్ ,బూత్ అధ్యక్షులు ఆకుల శ్రీధర్, పిట్ట కిషోర్, ఉడుత చిరంజీవి, కృపేందర్ రెడ్డి, వెనిశెట్టి రాజేష్, వెల్దండి హేమంత్, తడక విక్రం, పల్లె బోయిన భద్రయ్య, మేకల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post