ఆరోగ్యశ్రీ నిధుల అవకతవకలపై సుదీర్ఘ విచారణ
శస్త్రచికిత్సల రికార్డుల ఆధారంగా సోదాలు
వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ నిధులు అవకతవకలపై వచ్చిన ఆరోపణలపై గురువారం విజిలెన్స్ డీఎస్పీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఆ విభాగం అధికారులు తనిఖీలు చేపట్టారు. విజిలెన్స్ డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్ సభ్యు లు ఎంజీఎం చేరుకొని రికార్డులను పరిశీలించారు. ఎంజీఎం ఆసుప త్రిలో 2021 - 24 వరకు ఆరోగ్యశ్రీ ద్వారా చేసిన ఆపరేషన్లు వచ్చిన నిధుల వివరాలను రికార్డుల ఆధారంగా విచారణ చేపట్టారు. ఈ నిధు లు అవసరమైన పనులకు కాకుండా అనవసరమైన పనులకు వెచ్చించి నట్లు ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సోదా సాగింది. నాలుగేళ్ల కాలంలో ఎంజీఎం ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కి సంబంధించి 30 కోట్లకు పైగా నిధులు ఆసుపత్రికి వచ్చాయి. నిధుల ఖర్చు విషయంలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదు రావడంతో ఆధ్వర్యంలో ఈ తనిఖీలను చేశారు. విజిలెన్స్ తనిఖీలు వాస్తవమేనని ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరిచంద్రారెడ్డి స్పష్టం చేశారు.
Post a Comment