హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల పరిధిలో బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు-కొత్తగట్టు రోడ్డుపై కారు అదుపు తప్పి బోల్తా పడటంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు పరకాల మండలం నాగారం గ్రామానికి చెందిన బొంపల్లి కిషన్ రావు, రేగొండ మండలం రాపాకపల్లి గ్రామానికి చెందిన పార్శ సంపత్ గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఆత్మకూరులో రోడ్డు ప్రమాదంస్పాట్ లోనే ఇద్దరు మృతి
byBLN TELUGU NEWS
-
0
Post a Comment