శాయంపేట మండలంలోని పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు

శాయంపేట: వరి ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు అక్రమాలకు తావులేకుండా కొనుగోళ్లు జరపాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పేర్కొన్నారు. శాయంపేట మండలంలోని పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తేమశాతం సరిగా ఉండేలా నిర్వాహకులు చూసుకోవాలన్నారు. కాంటా తర్వాత కొనుగోలు కేంద్రం నిర్వాహకులదే బాధ్యతని, మిల్లర్లు తరుగు పేరిట రైతులను ఇబ్బందులకు గురి చేస్తే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. సివిల్ సప్లై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కల్యాణ లక్ష్మి, సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డీఎం మహేందర్, తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో ఫణి చంద్ర, ఇతర నాయకులు, మహిళ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post