స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. చీఫ్ జస్టిస్ సెలవులో ఉండటంతో ఇవాళ (సోమవారం) జరగాల్సిన విచారణ వాయిదా పడింది. దీనిపై మంగళవారం నాడు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నది. ఈ నెల 25 లేదా 26వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు నంబంధించి ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని గురువారం తన కార్యాలయం నుంచి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గత షెడ్యూల్లో ప్రకటించినట్టుగా మూడు దఫాల్లో ఎన్నికలను నిర్వహి స్తారని తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 20-25 తేదీల్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ముగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తున్నది
Post a Comment