కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం.
ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గండ్ర
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.
BLN తెలుగు దినపత్రిక :శాయంపేటలో జరిగిన కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టారు. మహిళల ఆత్మగౌరవం, అభ్యున్నతికి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. ప్రతి మహిళకు పారదర్శకంగా నాణ్యమైన చీరలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, అద్దె బస్సులకు యాజమాన్యం కల్పించడం, యూనిఫాం కుట్టే బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించడం వంటి కార్యక్రమాలను వివరించారు.కార్యక్రమం అనంతరం వివిధ గ్రామాలకు చెందిన 18 మంది లబ్ధిదారులకు రూ.5,23,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Post a Comment