చిట్యాల మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే జీఎస్సార్

చిట్యాల, అందుకుతండా, గిద్దెముత్తారం గ్రామాలల్లో వరి ధాన్యం కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే..
- రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్న ఎమ్మెల్యే.. భూపాలపల్లి నియోజకవర్గం చిట్యాల మండలం చిట్యాల,
అందుకుతండా, గిద్దెముత్తారం గ్రామాలల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పర్యటించారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం కష్టపడి శ్రమించి పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రజా ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి, ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధరలు పొందాలని రైతులను ఎమ్మెల్యే కోరారు. రైతుల సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఎవరూ ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా జరపాలని సంబంధిత శాఖల అధికారులకు ఎమ్మెల్యే సూచించారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post