రాహుల్ గాంధీ ప్రారంభించిన ఓటు చోరీ పోరాటానికి మద్దతుగా సంతకాల సేకరణ ప్రారంభించిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

శాయంపేట మండలం 7 అక్టోబర్ 2025:
 శాయంపేట మండల కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రారంభించిన ఓటు చోరీ పోరాటానికి మద్దతుగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన  భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఓటు చోరీతోనే మూడవ సారి అధికారంలోకి వచ్చారని, తెలంగాణలో ఎనిమిది ఎంపీ సీట్లను సైతం అలాంటి మోసాలకు పాల్పడే గెలిచిందని ఆరోపించారు. ప్రతి గ్రామములో కనీసం 100 సంతకాలు సేకరించాలని అన్నారు. దేశంలో ఓటు హక్కును,ప్రజాస్వామ్య విలువను కాపాడుకునేందుకు ప్రజలంతా కలిసికట్టుగా పోరాటం చేయాలని అన్నారు.
అనంతరం మండల కేంద్రంలో 
వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా జరిగినవి.ఎమ్మెల్యే వాల్మీకి మహర్షి ఫోటోని పాలతో కడిగి పూల మాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ రామాయణ మహాకావ్యాన్ని మానవాళికి అందించిన మహనీయుడు వాల్మీకి మహర్షి అని అన్నారు. వాల్మీకి మహాకవి విరచిత రామాయణ ఇతిహాసం.. సదా అనుసరణీయం..ఆదర్శప్రాయమన్నారు అఖండ భారతావనికి ఆదర్శప్రాయుడై నిలిచిన.. లోకభిరాముని దివ్యచరితను లోకొత్తరం చేసిన ఆదికవి వాల్మీకి మహర్షి అని తెలిపారు. కృషి ఉంటే మనుషులు..రుషులవుతారు..మహాపురుషులవుతారన్న మాటలకు వాల్మీకి మహర్షి జీవితం ఒక ప్రత్యక్ష నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమాలలో ఎమ్మెల్యే  వెంట శాయంపేట మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post