పోషణ మాసం ముగింపు ఉత్సవంలో పాల్గొన్న వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

హనుమకొండ:మాతా, శిశు సంపూర్ణ ఆరోగ్య రక్షణే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు ముందు కెళ్తోందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. అందుకోసం ప్రతి ఏడాది పోషణ్‌ అభియాన్‌ పేరిట మాసోత్స వాలను నిర్వహిస్తున్నదని తెలిపారు. హనుమకొండ మిలీనియం కన్వెన్షన్ లో గురువారం ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ మాసం ముగింపు ఉత్సవానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, మహిళలు, గర్భిణీలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో పోషకాహారం ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి కుటుంబం ఆరోగ్యవంతంగా ఉండేందుకు సమాజంలో పోషణ పై అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని చెప్పారు. ఐసిడిఎస్ లబ్ధిదారులైన గర్భిణీ స్త్రీల పోషణ స్థితిని మెరుగుపరిచినట్లయితే మన భావితరాల పిల్లలు ఆరోగ్యంగా జన్మనివ్వడం జరుగుతుంది అన్నారు. భావితరాలు పోషణ లోపం లేకుండా ఆరోగ్యవంతమైన తెలంగాణ ఏర్పడుతుందన్నారు.
ఒక కుటుంబం ఆరోగ్యంగా ముందుకు వెళ్లాలంటే కుటుంబంలో మహిళల పాత్ర ప్రత్యేకమని అన్నారు. పోషణ మాసంలో భాగంగా ఏర్పాటుచేసిన కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్, గర్భిణీలకు సామూహిక సీమంతాలు, ఆరు నెలలు పూర్తయిన పిల్లలకు అన్నప్రాసనలు, అంగన్వాడి పూర్వ ప్రాథమిక విద్యకి నమోదైన పిల్లలకు అక్షరాభ్యాసంలోఎంపీ డాక్టర్ కడియం కావ్య పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, డీఎంహెచ్ ఓ, DWO, ప్రిన్సిపల్ సైంటిస్ట్ కెవికె, డి ఆర్ డి ఓ, అంగన్వాడీ టీచర్లు సిడిపిఓలు తదితరులు పాల్గొన్నారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post