శాయంపేట చేనేత కార్మికుల ఆవేదన – చైర్మన్‌పై ఆగ్రహంహనుమకొండ జిల్లా షాయంపేట మండల కేంద్రంలోని చేనేత పారిశ్రామిక సహకార సంఘానికి చెందిన కార్మికులు రెండు నెలల 17 రోజులుగా చేసిన పనికి వేతనాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.పలు మార్లు వేతనాల కోసం మొరపెట్టుకున్నా సంఘం చైర్మన్ మామిడి శంకర్ లింగం “సంఘంలో డబ్బులు లేవు, వచ్చిన తర్వాత చూస్తాము” అని చెబుతూ కాలయాపన చేస్తున్నారని కార్మికులు ఆరోపించారు. చైర్మన్‌గా ఉన్న వ్యక్తి కార్మికుల సమస్యలపై బాధ్యత తీసుకోకుండా, “మేనేజర్ చూసుకుంటాడు, నాకు తెలీదు” అని సమాధానం ఇవ్వడం తగదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రస్తుత పాలకవర్గం గత పన్నెండు సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పటికీ, కార్మికుల పట్ల న్యాయం చేయకుండా విస్మరిస్తోందని వారు తెలిపారు. వేతనాల సమస్యకు పరిష్కారం చూపకపోతే పాలకవర్గాన్ని రద్దు చేసి కొత్త మండలిని నియమించాలని డిమాండ్ చేశారు.తమ డిమాండ్లు నెరవేర్చకపోతే నిరాహార దీక్ష చేపట్టి బాధలను పై అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని కార్మికులు హెచ్చరించారు. పాలకవర్గం అవకతవకలపై జిల్లా అధికారులతో విచారణ జరిపించాలని కోరుతూ, స్పందన రాకపోతే జిల్లా స్థాయిలో ఉద్యమం చేపడతామని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో పలువురు చేనేత కార్మికులు పాల్గొన్నారు.
చేనేత కార్మికుల ఆకలి కేకలు – వేతనాల కోసం నిరీక్షణ
byBLN TELUGU NEWS
-
0
Post a Comment