హైదరాబాదులోని సచివాలయంలో భారీ నీటిపారుదల శాఖ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన తమ ఛాంబర్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇరిగేషన్ అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం జరిగినది. ఈ సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా శాసనసభ్యులతో పాటు భూపాలపల్లి శాసనసభ్యులు .గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపాలపల్లికి సంబంధించిన DBM-38 కెనాల్ ద్వారా రామప్ప చెరువు నుండి భూపాలపల్లి నియోజకవర్గంలోని మూడు మండలాలు రేగొండ,చిట్యాల మరియు మొగుళ్ళపల్లికి సాగునీరు అందించాలని,GAP ఆయకట్టు ద్వారా మూడు నియోజకవర్గాలు ములుగు, భూపాలపల్లి మరియు మంథనిలలోని నాలుగు మండలాలలోని 25 గ్రామాలకు సాగునీరు అందించాలని మంత్రి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క , మహబూబ్ బాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బలరామ్ నాయక్ , ఇతర ఎమ్మెల్యేలు మరియు ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ఇరిగేషన్ అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్...
byBLN TELUGU NEWS
-
0
Post a Comment