శాయంపేట, అక్టోబర్ 14, BLN తెలుగు దినపత్రిక : చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి విక్రయ సంఘ పాలకవర్గం కార్మికులను పట్టించుకోకుండా గత రెండు నెలల 15 రోజులుగా వేతనాలు చెల్లించకుండా కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని మంగళవారం ధర్నాకు ఉపక్రమించారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ చేనేత సహకార సంఘంలో కార్మికులకు జీతాలు చెల్లించకుండా మభ్యపెడుతూ పని చేయించుకుంటున్నారని, తాము ఆకలితో అలమటిస్తున్న పట్టించుకోవడంలేదని పాలకవర్గం పై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు గడుస్తున్నా నూతన పాలకవర్గ ఎన్నికలను నిర్వహించకపోవడంతో అప్పుడు ఏర్పడిన పాలకవర్గమే సంఘాన్ని పరిపాలిస్తున్నారని, సంబంధిత అధికారులు కూడా కార్మికులను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత 45 సంవత్సరాలుగా కార్మికుడిగా పని చేస్తున్న ఏనాడు కార్మికులకు వేతనాలు చెల్లించకుండా ఉన్న పాలకవర్గం లేదని, ఇప్పుడున్న పాలకవర్గ అసమర్థతతోనే తమకు వేతనాలు అందడం లేదని ఆవేదన చెందారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకవర్గం స్పందించి తమకు వేతనాలను చెల్లించాలని కోరారు.రెక్కా డితే కానీ డొక్కాడని కార్మికులతో పాలకవర్గం కానీ అధికారులు కానీ ఆడుకోవద్దని, కార్మికుల కష్టాలను గుర్తించి వెంటనే వేతనం చెల్లించాలని లేనిపక్షంలో ధర్నాను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో కార్మిక నాయకులు పూల ఐలుమల్లు, ఆకునూరి జనార్ధన్, కందగట్ల కుమారస్వామి, మంత్రి అశోక్, కార్మికులు బాసని లక్ష్మీనారాయణ, సాంబయ్య, వెంకటేశ్వర్లు, దామోదర్, బాసనిచంద్ర ప్రకాష్ బాసని నవీన్. మహిళా కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
చేనేత కార్మికుల ఆకలి కేక... రెండు నెలల పదిహేను రోజులుగా అందని వేతనాలుసంఘ భవనం ముందు ధర్నాకు దిగిన కార్మికులు
byBLN TELUGU NEWS
-
0
Post a Comment