సమస్త మానవాళికి బాపూజీ ఎంచుకున్న మార్గం ఆచరణీయమని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అభిప్రాయపడ్డారు. గురువారం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులతో కలిసి బుచ్చిరెడ్డి మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి నూలు దారం మాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ... ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల ద్వారా బ్రిటిష్ పాలన బలహీనపరిచి దేశం స్వాతంత్రం పొందడంలో కీలకపాత్ర పోషించారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా సమానత్వం, శాంతి కోసం చేపట్టిన ఎన్నో పోరాటాలకు ఆయన జీవితం, సిద్ధాంతాలు ప్రేరణగా నిలిచాయని కొనియాడారు. సామరస్యం, సమానత్వం, న్యాయం కోసం గాంధీజీ తన జీవితాన్ని అంకితం చేశారని, ఆయన కలలను నిజం చేయడమే ఆ మహాత్ముడికి మనమిచ్చే ఘనమైన నివాళి అని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో నాయకులు మారపల్లి రవీందర్, చిందం రవి, వైనాల కుమారస్వామి, దుబాసి కృష్ణమూర్తి, నిమ్మల రమేష్, వలి హైదర్, చింతల రవిపాల్, మార్కండేయ, రవి, రఫీ, వెంకటరమణ, చిరంజీవి, సంపత్, వీరన్న, రాజు, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు
శాయంపేటలో గాంధీజీ జయంతి వేడుకలు
byBLN TELUGU NEWS
-
0
Post a Comment