వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పర్యాటక రంగ అభివృద్ధికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. మంగళవారం హనుమకొండలోని కనకదుర్గ కాలనీలోని తన కార్యాలయంలో పురావస్తు శాఖ అధికారులతో పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య సమీక్షసమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ,
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చారిత్రక ఆలయాలు, కాకతీయ వారసత్వ సంపదను పునరుద్ధరించాలంటూ పురావస్తు శాఖ అధికారులకు ఎంపీ సూచించారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించాలంటే ఆలయాల పునరుద్ధరణ పనులు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. వరంగల్ వేయి స్తంభాల ఆలయంలోని కల్యాణ మండపం మరమ్మతులు, విగ్రహ ప్రతిష్టాపన, శ్రీ భద్రకాళి ఆలయం, చిల్పూర్ లోని శ్రీ బుగులు వెంకటేశ్వరస్వామి ఆలయాల అభివృద్ధి తో పాటు, భూపాలపల్లి జిల్లాలోని నపాక ఆలయం, కోటగుళ్లు, రెడ్డి గుడి ప్రత్యేక శిలలపై నిర్మితమైన ఆలయాల పునరుద్ధరణకు పైలెట్ ప్రాజెక్టు కింద పనులు వేగవంతం చేయాలని సూచించారు. అలాగే వరంగల్ కోటలో ఉన్న 14 ఆలయాలకు పునరుద్ధరణ పనులను పూర్తి చేయాలన్నారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని శంబునిగుడి, గణపేశ్వర స్వామి దేవాలయం (కోటగుల్లు), ఏకవీర/ఎల్లమ్మ ఆలయం, రెడ్డి గుడి దేవాలయం, త్రికూట దేవాలయాలు, కోటబురుజులు (ద్వారాలు), సర్వయ్ పాపారాయుడు కోట, పాండవులు గుట్ట, సర్వతోభద్ర టెంపుల్,వేణుగోపాల స్వామి దేవాలయం,పద్మాక్షి ఆలయం, పంచకూటాలయాలను ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకు కేటాయిస్తే ఆలయాల అభివృద్ధి మరింత జరుగుతుందని వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్తానని ఎంపీ తెలిపారు. అనంతరం పురవస్తు శాఖ అధికారులు, స్థానిక శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి కలిసి వేయి స్తంభాల ఆలయాన్ని ఎంపీ డా. కడియం కావ్య స్వయంగా పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఆర్కియాలజిస్ట్ సూపరింటెండింగ్ నిహిల్ దాస్, అసిస్టెంట్ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ రోహిణి పాండే, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment