తనను సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధికి రూ. 25 లక్షలు విరాళం ఇస్తానంటూ గిరయిగుట్ట తండా *పాత్లావత్ నూరియా నాయక్ ఆఫర్* ప్రకటించాడు. *రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని గిరయిగుట్ట తండా గ్రామపంచాయతీలో* దాదాపుగా *550 మంది ఓటర్లు* ఉండగా రిజర్వేషన్ ఖరారైన నేపద్యంలో సర్పంచ్ గా ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధికి రూ. 25 లక్షలు విరాళంగా ఇస్తానని గిరాయగుట్ట, నాగర్లగడ్డ తండాలను అభివృద్ధి చేసి చూపిస్తానని, గ్రామానికి చెందిన రైతు పాత్లవత్ నూరియా నాయక్ తెలిపారు. పార్టీలతో సంబంధం లేకుండా పార్టీలకతీతంగా ఏకగ్రీవం చేయాలని ప్రకటించాడు. అయితే గ్రామ ప్రజలు అందరూ కలిసి దీని పై ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి. అదేవిధంగా ఎన్నికల్లో డబ్బులు వృధాగా ఖర్చు చేసే బదులు ఇలా అభివృద్ధి చేసే వ్యక్తులను, గ్రామ అభివృద్ధికి కృషి చేసే వాళ్లను ఎన్నుకోవాలని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.
ఏకగ్రీవంగా సర్పంచ్ చేస్తే రూ.25లక్షలు ఊరి అభివృద్ధికి విరాళంగా ఇస్తా...!!
byBLN TELUGU NEWS
-
0
Post a Comment