శాయంపేట : 100 రోజుల్లో అమలు
చేస్తామన్న ఆరు గా ంటీల హామీల సంగతి ఏమైందని శాయంపేట మాజీ ఉప సర్పంచ్ సుమన్ ప్రశ్నించారు. మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డు గురించి ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఫైర్ అయ్యారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీసి, తమకు రావలసిన బాకీ ఇవ్వండి అంటూ అడగాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Post a Comment