గ్రామానికి సేవ చేసేందుకే ముందుకు వస్తున్నాసూర్య నాయక్ తండ గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే సర్పంచ్ బరిలో- యువ సర్పంచ్ అభ్యర్థి జరుపుల గీత.

నాయకత్వం కోసం కాదు. గ్రామానికి సేవ చేసేందుకు ముందుకు వస్తున్నాననీ సూర్యనాయక్ తండా గ్రామానికి చెందిన యువ సర్పంచ్ అభ్యర్థి జరుపుల గీత అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన గ్రామ పంచాయతీల రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా మండలంలోని సూర్య నాయక్ తండ సర్పంచ్ ఎస్టీ మహిళ రావడం జరిగింది.కన్నతల్లి లాంటి ఊరు కోసం ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ బరిలో నిలిచి, గెలిచిన తర్వాత సామాన్య ప్రజలకు సేవ చేసేందుకు యువ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉంటానని రాజకీయాల్లో నా వంతు పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నానని సర్పంచ్ గా అవకాశం ఇస్తే గ్రామాభివృద్ధిలో పాలుపంచుకొని కన్నతల్లి లాంటి ఊరుకి నా వంతు కృషిగా పని చేసి ఆచరణలో చూపెడతాననీ గ్రామానికి సేవ చేయాలనే దృక్పథంతోనే సర్పంచ్ బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.ప్రజలు ఆశీర్వదిస్తే తప్పకుండా సర్పంచ్ గా పోటీ చేసి విజయం సాధించి గ్రామాభివృద్ధిలో పాలుపంచుకుంటానని అన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post