కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్నికల మానిఫెస్టో లో పెట్టిన కనీస గౌరవ వేతనం రూ.5000, మరియు కమీషన్ పెంపు ను వెంటనే ప్రకటించాలని,.. డీలర్లు పంపిణీ చేసిన 5 నెలల కేంద్ర ప్రభుత్వ బియ్యం కమీషన్ డబ్బులు వెంటనే చెల్లించి ఇట్టి కమీషన్ ను రాష్ట్ర కమీషన్, కేంద్ర కమీషన్ అని వేరువేరుగా కాకుండా ఒకే కమీషన్ గా ఏ నెలది ఆ నెలకు చెల్లించాలని, మరియు మాయొక్క ఇతర ముఖ్య డిమాండ్ లను ఆమోదించాలని... మా ఆవేదనను ప్రభుత్వానికి తెలుపుట కొరకు శాంతియుతంగా - సెప్టెంబర్, 5 శుక్రవారం ఒక్కరోజు రాష్ట్రవ్యాప్త రేషన్ దుకాణాల బంద్ కు పిలుపు
పైన పేర్కొన్న విషయమును అనుసరించి తమరికి మనవి చేయునది ఏమనగా తెలంగాణ రాష్ట్రం లో రేషన్ డీలర్లుగా పనిచేస్తున్న మాకు కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మ్యానిపెస్టోలో a)కనీస గౌరవ వేతనం రూ:5000/ లు, మరియు కమీషన్ పెంచి అందిస్తామని ప్రకటించిన క్రమంలో ప్రభుత్వం ఏర్పడి 21 నెలలు గడుస్తున్నా ఇంతవరకు మా గురించి పట్టించుకోవడం లేదు. CM రేవంత్ రెడ్డి పౌరసరఫరాల మినిష్టర్ ఉత్తం కుమార్ రెడ్డి సివిల్ సప్లయ్ కమీషనర్ మా మొరను ఆలకించాలని మేము ఎన్ని వినతి పత్రాలు సమర్పించినా మా విషయంలో కనీస స్పందన కరువయ్యింది.
గత ఎప్రిల్ నెల నుండి ఆగస్ట్ వరకు మేము పంపిణీ చేసిన 5 నెలల కేంద్ర ప్రభుత్వ బియ్యం యెక్క కమీషన్ డబ్బులను మాకు ఇంతవరకు చెల్లించలేదు. పెరుగుతున్న ధరలు, షాపుల అద్దెలు, గుమస్తా భత్యం, కరెంటు బిల్లులు, ఇంటర్నెట్ చార్జీలు, దిగుమతి హమాలీ చెల్లింపులు మొదలగు విపరీత ఖర్చులు భరించలేని పరిస్థితిలో మా కనీస అవసరాలు తీరక రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది.
మా కుటుంబాల పోషణ భారమయ్యి, పిల్లల చదువులు ఆగిపోయి వచ్చే బతుకమ్మ, దసరా పండుగల పూట మా జీవనం దుర్భరం గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అదికారం లోకి వస్తే మా డీలర్ల బతుకులు బాగుపడతాయని ఎంతో ఆశ తో ఎదురు చూస్తున్న క్రమం లో మా ఆశను నిరాశగా మార్చరని మా ఆశాజ్యోతి CM రేవంత్ రెడ్డి మీద నమ్మకంతో పనిచేస్తున్నాము.
ప్రస్తుతం 21 నెలలుగా ఓర్పు వహించిన మేము ఇప్పుడు శాంతియుతంగా మా బాదలు, ఇబ్బందులను గాంధేయ పద్ధతిలో శాంతియుత కార్యక్రమాల ద్వారా ప్రభుత్వానికి విన్నవించడానికిగాను సెప్టెంబర్,5 శుక్రవారం ఒక్కరోజు రాష్ట్రవ్యాప్త రేషన్ దుకాణాల బంద్ కు పిలుపు ఇవ్వడమైనది.
డీలర్ల యెక్క ప్రదాన సమస్యలు
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల తమ ఎన్నికల మానిఫెస్టో లో పెట్టిన విదంగా రేషన్ డీలర్లకు రూ: 5000/- గౌరవవేతనం, కమీషన్ పెంపును వెంటనే ప్రకటించాలి.
5 నెలల కేంద్ర కమీషన్ డబ్బులు వెంటనే విడుదల చేసి.. రాష్ట్ర కమీషన్, కేంద్ర కమీషన్ అని వేరు వేరు గా కాకుండా ఒకే కమీషన్ గా చెల్లించాలి. అంతేగాకుండా మేము కోరుతున్న మా యెక్క ఇతర ముఖ్యమైన డిమాండ్ల ను వెంటనే ఆమోదించాలని... ఇట్టి సెప్టెంబర్,5 శుక్రవారం ఒక్కరోజు రాష్ట్రవ్యాప్త రేషన్ దుకాణాల బంద్ కు పిలుపు ను మీడియా ద్వారా ప్రకటిస్తున్నాము.
ఇతర విన్నపాలు
---------------------
1. రేషన్ షాపులను మిని సూపర్ మార్కెట్లుగా గుర్తించి మరిన్ని నిత్యావసర సరుకులను పేద ప్రజలకు అందుబాటులోకి తేవాలి.
2. దుమ్ము, దూళితో తరుచూ అనారోగ్యం పాలవుతున్న రేషన్ డీలర్ల కుటుంబాలకు హెల్త్ కార్డులు జారీ చేయాలి.
3. బియ్యం దిగుమతి చార్జీలను ప్రభుత్వమే భరించాలి.
4. రేషన్ డీలర్ చనిపోతే రేషన్ డీలర్ కుటుంబానికి దహన సంస్కారాలకు రూ.30000 చెల్లించాలి.
5. గత 10 సం.లుగా పేరుకుపోయిన పాత బకాయిలను వెంటనే చెల్లించాలి.
6. గోదాముల నుండి భారీ ఆన్లైన్ వెయింగ్ కాంటాల(లారీని తూకం వేసే విదంగా)ద్వారా రేషన్ షాపులకు సరుకుల పంపిణీ జరిగేలా గోదాం ప్రాంగంణంలో శాశ్వత ప్రతిపదికన వే-బ్రిడ్జిలు ఏర్పాటు చేయలి.
7. పోర్టుబిలిటీ సిస్టం వచ్చినందున రేషన్ కార్డుల బైఫర్గెషన్ విదానాన్ని నిలుపుదల చేసి, కొత్త షాపుల ఏర్పాటు రద్దు చేయాలి. అత్యవసరమయితే గ్రామీణ ప్రాంతాల్లో 800 కార్టులు, పట్టణ ప్రాంతాల్లో 1200 కార్టులకు పైబడి ఉన్న రేషన్ షాపులను మాత్రమే బైఫర్గెషన్ చేయాలి.
8. కరోనాతో మరణించిన రేషన్ డీలర్ల కుటుంబాలకు 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందించాలి.
9. ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి చేపట్టే మా ఆథరైజేషన్ రిణీవల్స్ ను ఎలాంటి రిణీవల్స్ లేకుండా శాశ్వత ప్రాతిపదికన కొనసాగించాలి.
10. గోదాముల నుండి రేషన్ దుకాణాలకు చేర్చేసరికి బియ్యం తరుగు వచ్చి డీలర్లు నష్టపోతున్నందున,తరుగుదల క్రింద 2% బియ్యం కోటాను అదనంగా అందించాలి.
11. రేషన్ దుకాణాల యెక్క అద్దె ను ప్రభుత్వమే భరించాలి. గుమస్తా భత్యం, కరెంటు బిల్లులు, ఇంటర్నెట్ చార్జీలు, దిగుమతి హమాలీ చెల్లింపులు ప్రభుత్వమే చెల్లించాలి.
12. ఏ నెల కమీషన్ ను ఆ నెలలోనే ఇవ్వగలరు.(2, 3 నెలలుగా కమీషన్ రావాలి. కాని రావడం లేదు). 13. హైద్రాబాద్ నగరంలో “రేషన్ భవన్" నిర్మాణానికి 1000 చ.గ.ల స్థలం కేటాయించాలి.
14. రేషన్ డీలర్లలలో ఉన్నత విద్యావంతులైన వారికి శాఖాపరమైన పదోన్నతులను కల్పించి వారి సేవలను వినియోగించుకోవాలి
ఈ కార్యక్రమంలో శాయంపేట మండల అధ్యక్షులు సామల మల్లయ్య , ప్రధాన కార్యదర్శి అమ్మ అశోక్ , రఘుసాల బాపూరావు, సింగరి కొండ రమేష్ గుప్తా వివిధ గ్రామాల డీలర్లు పాల్గొనడం జరిగింది
Post a Comment